20 రోజుల్లో రెండోసారి కరోనా.. తలలు పట్టుకుంటున్న వైద్యులు

20 రోజుల్లో రెండోసారి కరోనా.. తలలు పట్టుకుంటున్న వైద్యులు
ఉత్తరప్రదేశ్ లో ఓ కానిస్టేబుల్ కరోనా నుంచి కోలుకున్న 20 రోజుల్లోనే మరోసారి ఈ మహమ్మారి బారినపడ్డాడు.

ఉత్తరప్రదేశ్ లో ఓ కానిస్టేబుల్ కరోనా నుంచి కోలుకున్న 20 రోజుల్లోనే మరోసారి ఈ మహమ్మారి బారినపడ్డాడు. లక్నోలో హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఆగస్టులో కరోనా సోకింది. దీంతో కరోనా చికిత్స పొంది.. ఆగస్టు 11ను నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, 20 రోజుల తరువాత జ్వరం రావడంతో మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. యూపీ ఒకే వ్యక్తికి రెండో సారి కరోనా రావడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. ఆయన లోక్‌బంధు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి యాంటీ బాడీలు తయారవుతాయని.. అవి మరోసారి ఈ మహమ్మారి బారినపడకుండా కాపాడుతాయని అన్నారు. అయితే, 5శాతం మందిలో యాంటీబాడీలు తయారవ్వడం లేదని.. ఈ కారణంగానే కానిస్టేబుల్ కు మరోసారి కరోనా పాజిటివ్ అని వచ్చి ఉండొచ్చని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story