సిటీలో 144 సెక్షన్.. న్యూ ఇయర్ వేడుకలు బంద్

ఈ రోజులానే రేపు ఉంటుంది.. అయినా కొత్త సంవత్సరం వస్తుందంటే అదేదో కొత్తగా వస్తున్నట్టు ఆ పేరుతో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. మద్యం ఏరులై పారుతుంది.. ముఖ్యంగా యువతరం డిసెంబర్ 31 రాత్రి అంతా క్లబ్బులు, పబ్బుల్లో గడిపేస్తుంది.. అసలే కోవిడ్ కాలం.. తగ్గింది కదా అనుకుంటే కొత్తరూపు సంతరించుకుని మళ్లీ వస్తోంది.. ఈ నేపథ్యంలో బెంగళూరు నగర పోలీసులు డిసెంబర్ 31 సాయింత్రం నుండి 12 గంటలపాటు సిఆర్పిసి సెక్షన్ 144ను విధించారు.
బెంగళూరు పోలీసుల నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధ ఉత్తర్వు నగర పరిధిలో అమల్లో ఉంటుంది. ఇంతలో, ఎంజి రోడ్, చర్చి స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్, కోరమంగళ, ఇందిరానగర్ వద్ద 'నో-మ్యాన్' జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. పబ్బులు, బార్‌లు, రెస్టారెంట్లు కోసం ముందస్తు రిజర్వేషన్ కూపన్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది.
కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా అనుసరించి ప్రజలు నివాస కాలనీల ప్రాంగణంలో వేడుకలను నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. మ్యూజికల్ నైట్స్‌కి మాల్స్, పబ్బులు, రెస్టారెంట్లు, క్లబ్‌హౌస్‌లలో ప్రదర్శనలు అనుమతించబడవు అని బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. కోవిడ్ కేసులలో గణనీయమైన తగ్గింపును చూసిన రాష్ట్రం, బ్రిటన్‌లో వైరస్ యొక్క కొత్త వేరియంట్ వెలువడిన తరువాత కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com