పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో వై-ప్లస్ సెక్యూరిటీ.. అవసరమా!!: న్యాయవాది

పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో వై-ప్లస్ సెక్యూరిటీ.. అవసరమా!!: న్యాయవాది
ఓ నటికి ఇంత సెక్యూరిటీ అవసరమా.. అని సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప వ్యాఖ్యానించారు.

ఓ నటికి ఇంత సెక్యూరిటీ అవసరమా.. దాని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది అని సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప వ్యాఖ్యానించారు. ఆమె తన సెక్యూరిటీని ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పుడు ఆమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో సురక్షితంగా ఉన్నారని అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమెకు ఇచ్చిన భద్రత గురించి న్యాయవాది సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఒక వ్యక్తికి వై కేటగిరీ భద్రత ప్రతి నెలా 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ డబ్బును పన్ను చెల్లింపుదారులు భరిస్తారు. ఇప్పుడు కంగనా హిమాచల్ ప్రదేశ్ లో సురక్షితంగా ఉంది (POK కి దూరంగా), మోడీ సర్కార్ ఆమెకు అందించిన భద్రతను దయతో ఉపసంహరించుకుంటారా ?! "అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ కు కంగన స్పందించారు..

"బ్రిజేష్ జీ నాకు వై-ప్లస్ సెక్యూరిటీ నేను కోరితే ఇవ్వలేదు. ప్రమాదం పొంచి ఉందని భావించి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఐబి (ఇంటెలిజెన్స్ బ్యూరో) ప్రమాదాన్ని పసిగడుతోంది. నా సెక్యూరిటీ రాబోయే రోజుల్లో దేవుని దయ వల్ల అది పూర్తిగా తొలగించబడవచ్చు లేదా సెక్యూరిటీ ఇంకా పెరిగే అవకాశమూ ఉండవచ్చు"అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 9 న కంగనాకు వై-ప్లస్ సెక్యూరిటీ ఇవ్వబడింది. తొలినాళ్లలో ముంబైలో నాకు తల్లి స్పర్శ కనిపించింది. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. నేను సజీవంగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ముంబైలో ఉగ్రవాద పరిపాలన సాగుతోందని ఆమె అన్నారు. కంగనా అధికార మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు సవాళ్లు విసురుతోంది. బాలీవుడ్ 'మాఫియా'తో కుమ్మక్కై తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని అంటోంది. ఠాక్రే అండర్ వరల్డ్ కార్యకలాపాలను బహిర్గతం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది.

Tags

Next Story