జాతీయం

Sekhar Kammula Love Story: సారీ వరుణ్ నిన్ను చూడలేదు.. ఆమెనే చూస్తుండిపోయా: చిరంజీవి

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి లవ్‌స్టోరీ యూనిట్‌ని ప్రశంసించారు.

Sekhar Kammula Love Story: సారీ వరుణ్ నిన్ను చూడలేదు.. ఆమెనే చూస్తుండిపోయా: చిరంజీవి
X

Sekhar Kammula Love Story: శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎదురుచూసే వ్యక్తులుంటారు. ఆయన ఎంచుకున్న కథలు, తీసే విధానం అన్నీ ఎంతో గొప్పగా ఉంటాయి. కుటుంబ కథగానే ఉంటుంది కానీ ఓ క్యూట్ లవ్ స్టోరీని తెరమీద చూపిస్తారు శేఖర్.. తాజాగా లవ్‌స్టోరీ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి లవ్‌స్టోరీ యూనిట్‌ని ప్రశంసించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా వేలమంది, పరోక్షంగా లక్షల మంది పని చేస్తుంటారని.. దూరం నుంచి చూసే వారికి ఇండస్ట్రీ పచ్చగా కనిపిస్తుంది. కానీ కష్టాలు పడే వారు చాలా మంది ఉంటారు. చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ 20 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. ఇక లవ్‌స్టోరీ చిత్రం గురించి మాట్లాడుతూ.. నాగచైతన్య చాలా కూల్ బాయ్ అని అన్నారు.

ఏ నిర్ణయం అయినా జాగ్రత్తగా తీసుకుంటాడని చైతూని ప్రశంసించారు. అలాగే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ఫిదా మూవీలో సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యానని, అందులో హీరోగా నటించిన వరుణ్ వచ్చి 'డాడీ సినిమా ఎలా ఉంది అని అడిగాడు.. దానికి సారీ నాన్నా.. సినిమాలో నిన్ను చూడలేదు.. సాయి పల్లవిని చూస్తుండిపోయా' అని అన్నానని తెలిపారు.

ఓ చిత్రంలో సాయి పల్లవిని నా చెల్లెలిగా తీసుకుంటానంటే ముందు ఓకే చెప్పాను.. కానీ మనసులో ఎక్కడో ఆమె రిజెక్ట్ చేస్తే బావుండనిపించింది. సరిగ్గా నేను అనుకున్నదే జరిగింది. ఆమె మా ఆఫర్‌ని తిరస్కరించింది. కారణం ఆమె రీమేక్ సినిమాలు చేయనందట.. అయితే సాయి పల్లవి ఒప్పుకోకపోతే బావుండని నేనేందుకు అనుకున్నానంటే ఆమె ఓ మంచి డ్యాన్సర్.. ఆమెతో డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ చెల్లెలిగా ఎలా అంగీకరించగలను అని అన్నారు.

Next Story

RELATED STORIES