రైలు బోగీలెక్కి సెల్ఫీ.. విద్యుత్ తీగలకు తగలడంతో..

ఇన్ని జరుగుతున్నా యువతీ యువకుల సెల్ఫీల పిచ్చి ఇంకా తగ్గలేదు. తాజాగా ఒడిస్సా పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సెల్పీ దిగుతూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పర్లాకిమిడి నుంచి రైళ్లు తిరగడం లేదు. దీంతో బోగీలు, ఇంజన్ వేరు చేసి పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు ఎలక్ట్రికల్ లైనును సరిచేస్తున్నారు రైల్వే విద్యుత్ సిబ్బంది.
ఇంతలో పర్లాకిమిడిలోని గౌర చంద్ర అనే వ్యక్తి బోగీ ఎక్కి సెల్ఫీ దిగాలనుకున్నాడు అక్కడే ఉన్న విద్యుత్ తీగలను సపోర్ట్ కోసం పట్టుకున్నాడు. దాంతో అతడు విద్యుత్ షాక్‌కి గురవడంతో ప్రాణాలు కోల్పోయాడు. బోగీలపై కప్పి ఉన్న గోనె సంచులకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో పోలీసులు యువకుడి మృత దేహాన్ని కిందికి దించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com