ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని డబ్బు, నగలు తీసుకుని రైల్వేస్టేషన్లో..: నవీన్ చంద్ర

ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని డబ్బు, నగలు తీసుకుని రైల్వేస్టేషన్లో..: నవీన్ చంద్ర
దాంతో నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించి అదే స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న నా మిత్రుడికి ఫోన్ చేశాను.

అందాల రాక్షసిలో అతడిని చూసింది. అప్పుడే మనసు పారేసుకుంది.. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని ఇంట్లో వాళ్లకి చెప్పకుండా రైలెక్కేసింది. హీరో నవీన్ చంద్రకు ఎదురైన ఓ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన నెంబర్ ద్వారా ఆ అమ్మాయి రోజూ నాకు కాల్స్ చేయడం ప్రారంభించింది. నాన్‌స్టాప్ కాల్స్.. ఒక్క నిమిషం కూడా వదలట్లేదు.. అర్థరాత్రిళ్లు కూడా మెసేజ్‌లు వస్తుండడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడిని.. కానీ ఓ రోజు తెల్లవారుజామున ఫోన్ ఆన్ చేయగానే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నాను అని మెసేజ్ పెట్టింది. దాంతో నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించి అదే స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న నా మిత్రుడికి ఫోన్ చేశాను.

విషయం చెప్పి ఏం చేయాలి అని అడిగాను. ఏం భయపడకు ఆ అమ్మాయితో తాను వెళ్లి మాట్లాడతాను అని అన్నాడు. అతడు వెళ్లి నవీన్ చంద్రను కలిసి ఏం చేస్తావు అని అడిగాడు.. పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. వెంటనే అతడు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. నేను వెళ్లగానే ఆ అమ్మాయి భోరున ఏడ్చేసింది. ప్లాట్‌ఫాంపై ఆమె ఏడుస్తుంటే నాకు భయం వేసింది. ఆమెకు నిదానంగా సర్థి చెప్పి వాళ్ల ఇంట్లో వాళ్లకి కాల్ చేసి రప్పించాం. విషయం వివరించాము. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాకు థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ తీసుకుని వచ్చేసిందట.. డబ్బుతో పాటు ఆమెను సురక్షితంగా వాళ్లకి అప్పజెప్పినందుకు ఎంతో సంతోషించారు అని నవీన్ చంద్ర తానెదుర్కున్న ఓ సంఘటనను వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story