Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్.. ఎవరీమె

Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్.. ఎవరీమె
X
Shelly Oberoi: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్ ఇప్పుడు ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

Selli Oberoi: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్ ఇప్పుడు ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలు మూడు పర్యాయాలు వాయిదా పడిన తరువాత ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించారు. ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం అనే అంశంపై కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు ఒబెరాయ్. డిసెంబరు 7న వార్డ్ నెం 86 నుండి జరిగిన సివిక్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన పోటీలో ప్రత్యర్థి దీపాలి కుమారిని 269 ఓట్లతో ఓడించారు.

39 ఏళ్ల ఒబెరాయ్ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి ఫిలాసఫీలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆమె అనేక అకడమిక్ అవార్డులను గెలుచుకున్నారు. ఒబెరాయ్ కళాశాల విద్యార్థులలో అత్యధిక గ్రేడ్ పాయింట్ సాధించింది. 'మిస్ కమలా రాణి ప్రైజ్' మరియు స్కాలర్‌షిప్‌ను పొందారు. ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యురాలిగా ఉన్నారు. వివిధ సమావేశాలలో ఆమె సత్కారాలు అందుకున్నారు. ఒబెరాయ్ ప్రొఫెసర్ మనుభాయ్ షా అవార్డు గెలుచుకుని గోల్డ్ మెడల్ సాధించారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం షెల్లీ ఒబెరాయ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. AAPలో చేరిన తర్వాత ఆమె 2020 వరకు ఢిల్లీ ఆప్ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆప్, బీజేపీ మధ్య రాజకీయ వైరం కారణంగా మూడు పర్యాయాలు మేయర్ ఎన్నికలను నిలిపివేయడంతో ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags

Next Story