Litre Petrol @ Rs. 1: రూ.1కే పెట్రోల్.. బారులు తీరిన జనం

Litre petrol @ Rs. 1: నిన్నగాక మొన్న లీటర్ పెట్రోల్ ధర రూ.100లు అన్న వార్త చదివాం.. ఇదేంటి సడెన్‌గా ఒక్క రూపాయికే పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది. వెళ్లి బండి ఫుల్ ట్యాంకు చేయించుకుందాం అని అనుకుంటున్నారు కదూ.. సీఎం కొడుకు పుట్టిన రోజు.. అందుకే సదరు మంత్రిగారు మహారాష్ట్ర ప్రజలకు ఓ చిన్న ట్రీట్ ఇచ్చారు. లీటర్ పెట్రోల్ రూ.1కే అని చాటింపు వేయడంతో జనం పొలోమని బండ్లు తీసుకుని బయల్దేరారు.
మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే. ఆయన రాష్ట్ర పర్యావరణ మంత్రిగా కొనసాగుతున్నారు. శివసేన పార్టీ మద్దతుదారులు మరియు సభ్యులు పెరిగిన ఇంధన ధరల నుండి పౌరులకు ఉపశమనం కలిగించే విధంగా డోంబివ్లిలో లీటరుకు రూ .1 చొప్పున పెట్రోల్ పంపిణీ చేశారు. సుమారు 1200 మంది వాహనదారులు లీటరు పెట్రోల్‌ని ఒక రూపాయికే అందుకున్నారు.
డోంబివ్లి ఎంఐడిసిలోని ఉస్మా పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం భారీ క్యూ కనిపించింది. ఈ పెట్రోల్‌ను డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన అసెంబ్లీ అధికారి యోగేశ్ మత్రేతో సహా పంపిణీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలు పెట్రోల్ పంపిణీ చేశారు.
"ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోల్ ధరను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఒక్కరోజైనా సులభతరం చేయ సంకల్పించారు.
మొదట మేము దీనిని మొదటి 500 మందికే పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాము, కాని జనసమూహం పెరగడంతో, సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించి సుమారు 1200 మంది ప్రజలకు పెట్రోల్ అందజేశారు. వ్యక్తికి 1 లీటరు చొప్పున అందించామని అని ఆయన వివరించారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయలకు చేరుకున్న తరుణంలో లీటర్ రూ.1కే అందించడం ముంబై వాసుల్లో ఆసక్తిని రేపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com