60ఏళ్ల వయసులో అమ్మ సైకిల్ మీద 600 కిలోమీటర్లు: ఉపాసన

60ఏళ్ల వయసులో అమ్మ సైకిల్ మీద 600 కిలోమీటర్లు: ఉపాసన
రోజుకు వంద కిలోమీటరల్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు

అపోలో చైర్ పర్సన్ కూతురు.. ఉపాసన తల్లి.. శోభన కామినేని తన 60వ పుట్టిన రోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. ఈనెల 25న ఉదయం తన భర్త అనిల్ కామినేనితో కలిసి చాలెంజ్ టు సైకిల్ టు చెన్నై ఫ్రం హైదరాబాద్ అనే నినాదాన్ని ఎంచుకుని బయల్దేరారు.

రోజుకు వంద కిలోమీటరల్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు వెళ్లి చెన్నైలో తన తండ్రి ప్రతాప్ సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. సైక్లింగ్‌తో తన భర్త, కూతురుతో కలిసి ఔటింగ్‌కు వెళ్లినంత ఆనందం కలిగిందని శోభన తెలియజేశారు.

సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. తన తల్లి తన 60వ పుట్టినరోజున హైదరాబాద్ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్లు సైకిల్ రైడింగ్ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని కూతురు ఉపాసన బుధవారం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.Tags

Next Story