Amazon: అమెజాన్ ఉద్యోగులకు షాక్.. అర్జంట్‌గా ఆఫీస్‌కు రమ్మన్న బాస్..

Amazon: అమెజాన్ ఉద్యోగులకు షాక్.. అర్జంట్‌గా ఆఫీస్‌కు రమ్మన్న బాస్..
Amazon: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అదే స్టైల్‌లో ఇప్పుడు ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అని పాడుకోవాల్సి వస్తుంది.

Amazon: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అదే స్టైల్‌లో ఇప్పుడు ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అని పాడుకోవాల్సి వస్తుంది. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్ బాట పట్టాయి. ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా మరికొంత మందిని ఇంటికి పంపే ప్రయత్నంలో భాగంగా.. రిమోట్ లొకేషన్‌లో పని చేస్తున్న వారైనా సరే అర్జంటుగా ఆఫీసుకు రండి అని మెసేజ్ పెట్టింది.



ఇప్పుడు, ఈ ఉద్యోగులలో చాలా మంది ఇంటి నుండి పని చేస్తున్నందున వారి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చుని కూడా భరిస్తామని, అవసరమైతే ఫ్లైట్‌లో అయినా సరే రండని మెయిల్ పెట్టింది. అదే ఇమెయిల్‌లో హోటల్ ఖర్చు కూడా కంపెనీ చెల్లిస్తుందని ఉద్యోగులకు తెలిపింది.



మీటింగ్ రోజున, ఉద్యోగులు సీనియర్ మేనేజర్ మరియు హెచ్‌ఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఇక రేపటి నుంచి విధులకు హాజరు కావలసిన పని లేదని మేనేజర్ చావు కబురు చల్లగా చెప్పారు. ప్రభావిత ఉద్యోగులు తమ అధికారిక పనిని పూర్తి చేయడానికి 4 గంటలు మాత్రమే ఉందని, ఆ తర్వాత వారి బ్యాడ్జ్, వర్క్ గ్రూప్‌లకు యాక్సెస్ బ్లాక్ చేయబడుతుందని చెప్పారు.



అమెజాన్ 5 నెలల సెవెరెన్స్ పేని అందజేస్తుందని ఉద్యోగం కోల్పోయిన వారికి తెలిపింది. జాబ్ ఆఫర్‌లను రద్దు చేసింది అమెజాన్ మాత్రమే కాదు. Meta ఇటీవల పూర్తి-సమయ ఆఫర్‌లను రద్దు చేస్తున్నట్లు ధృవీకరించింది. కంపెనీ మొత్తం 2023లో నియామకాలను నెమ్మదిస్తుందని కూడా సూచించింది. అయితే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు కొన్ని ముఖ్యమైన ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తామని తెలపాయి. ఈ రెండు సంస్ధలు గత వారం 22000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి.


Tags

Read MoreRead Less
Next Story