సుప్రీం కోర్టులో మాల్యాకు షాక్

సుప్రీం కోర్టులో మాల్యాకు షాక్
బ్యాంకు రుణాలు ఎగ్గొటిన విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో గట్టిషాక్ తగిలింది.

బ్యాంకు రుణాలు ఎగ్గొటిన విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో గట్టిషాక్ తగిలింది. కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేయడాన్ని సుప్రీం కోర్టు మరోసారి తప్పుపట్టింది. 2017లోనే ఇలా బదిలీ చేయడాన్ని తప్పుగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాల్యాను దోషిగా తేల్చించింది. అయితే, ఈ తీర్పును సమీక్షించాలని మాల్యా మరోసారి సుప్రీం తలుపుతట్టారు. దీనిపై విచారణ జరిపి ఆగస్టు 27న విచారణ జరిపి సోమవారానికి రిజర్వ చేసింది. దీంతో తీర్పును ఈ రోజు వెల్లడించింది. తీర్పును సమీక్షించాలని మాల్యావేసిన పిటిషన్ లో కొత్త విషయాలేమి లేవని స్పష్టం చేసింది. మాల్యా కోర్టు ఆదేశాల‌ను ధిక్కరిస్తూ బ్రిట‌న్ సంస్థ డియాజియో నుంచి త‌న‌కు రావాల్సిన 40 మిలియ‌న్ డాల‌ర్ల‌ను త‌న పిల్ల‌ల‌కు పేర్ల మీదకు మ‌ళ్లించార‌ని ఆరోపిస్తూ గ‌తంలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల క‌న్సార్టియం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది.

Tags

Read MoreRead Less
Next Story