Shocking!: 12 ఏళ్ల పసివాడికి కూడా గుండెనొప్పి.. స్కూల్ బస్సులోనే కుప్పకూలి..

Shocking!: 12 ఏళ్ల పసివాడికి కూడా గుండెనొప్పి.. స్కూల్ బస్సులోనే కుప్పకూలి..
Shocking!: మాయదారి గుండెనొప్పికి వయసుతో పని లేకుండా పోతోంది. ఫలానా కారణమంటూ ఉండట్లేదు కొన్ని జబ్బులకి. ఏ రోగం ఎందుకు వస్తుందో వైద్యులకు కూడా అంతుబట్టకుండా ఉంది.

Shocking: మాయదారి గుండెనొప్పికి వయసుతో పని లేకుండా పోతోంది. ఫలానా కారణమంటూ ఉండట్లేదు కొన్ని జబ్బులకి. ఏ రోగం ఎందుకు వస్తుందో వైద్యులకు కూడా అంతుబట్టకుండా ఉంది. నడి వయసు వారికి గుండె మీద ఒత్తిడి ఉంటుంది, ముదిమి వయసు వారికి తట్టుకునే శక్తి ఉండదు అని గుండె నొప్పికి పలు కారణాలు చెబుతారు. మరి చెంగు చెంగున తిరుగాడే పిల్లలకు కూడా గుండె నొప్పి వస్తుందంటే ఎలా అర్థం చేసుకోవాలి.



ఉదయాన్నే లేచి స్కూలుకు రెడీ అయ్యాడు. అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తిన్నాడు. ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాడు. అంతలోనే గుండెను పట్టుకుని కుప్పకూలిపోయాడు. బస్సులోనే ప్రాణాలు కోల్పోయాడు మధ్యప్రదేశ్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి. సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.



మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో 12 ఏళ్ల బాలుడు తన పాఠశాల బస్సులో గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం అతనికి చికిత్స చేసిన వైద్యుడు రాష్ట్రంలో గుండెపోటుకు గురైన అతి పిన్న వయస్కుడని చెప్పారు. 4వ తరగతి చదువుతున్న మనీష్ జాతవ్ గురువారం మధ్యాహ్నం ఎటావా రోడ్‌లోని తమ పాఠశాలలో తన సోదరుడితో కలిసి భోజనం చేసి, మధ్యాహ్నం 2 గంటలకు బస్సు ఎక్కిన వెంటనే కుప్పకూలిపోయాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.


బస్సు డ్రైవర్ పాఠశాల అధికారులను అప్రమత్తం చేశాడు. వారు పిల్లవాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనిని బ్రతికించడంలో విఫలమయ్యారని బంధువులు తెలిపారు. "గురువారం మధ్యాహ్నం మనీష్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. మేము అతనికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) అందించాము. కానీ అతడికి ఊపిరి అందలేదు. లక్షణాల ప్రకారం, అతను గుండె వైఫల్యంతో మరణించాడు అని జిల్లా ఆసుపత్రి సర్జన్ డాక్టర్ అనిల్ గోయల్ మీడియాకు వివరించారు. మృతుడి తల్లిదండ్రులు పోస్ట్‌మార్టం నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారని డాక్టర్ వివరించారు.


చిన్న వయసులో బాలుడు గుండెపోటుతో మరణించడం దురదృష్టకరమని డాక్టర్ గోయల్ అన్నారు. అయితే "ఒక అధ్యయనం ప్రకారం కోవిడ్ తర్వాత ఇటువంటి సంఘటనలు పెరిగాయి. MPలో యువకుడు గుండెపోటుతో మరణించడం ఇదే మొదటి కేసు అని డాక్టర్ పేర్కొన్నారు. మనీష్ తండ్రి కోమల్ మాట్లాడుతూ తన కుమారుడికి ఇప్పటివరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని కన్నీరు మున్నీరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story