Shocking: దారుణం.. అప్పు రూ.1500లు తీర్చలేదని.. యువకుడిని బండికి కట్టి..

Shocking: దారుణం.. అప్పు రూ.1500లు తీర్చలేదని.. యువకుడిని బండికి కట్టి..
Shocking: అప్పుగా తీసుకున్న 15 వందల రూపాయలు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడిని బండికి కట్టి 2 కిలోమీటర్లు లాక్కెళ్లారు.

Shocking: సమయానికి ఇస్తానని తీసుకున్న అప్పు రూ.1500 తిరిగి ఇవ్వలేదన్న కారణంతో 22 ఏళ్ల యువకుడిని ద్విచక్రవాహనానికి కట్టేసి రెండు కిలోమీటర్ల మేర పరుగెత్తించిన ఘటన ఒడిశాలోని కటక్ నగరంలో చోటుచేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.


యువకుడు జగన్నాథ్ బెహరా చేతులు 12 అడుగుల పొడవైన తాడుతో కట్టివేశారు. దాని మరొక చివర ద్విచక్ర వాహనానికి ముడివేశారు. రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుతాహత్ స్క్వేర్ వరకు దాదాపు 20 నిమిషాల పాటు యువకుడిని పరిగెత్తించారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తాత అంత్యక్రియల కోసం గత నెలలో ఇద్దరు నిందితులలో ఒకరి నుండి రూ.1500 అప్పుగా తీసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. 30 రోజుల్లో డబ్బు తిరిగి చెల్లిస్తానని బెహరా వాగ్దానం చేశాడు కానీ చెల్లించలేకపోయాడు. దాంతో నిందితులు అతడిని బండికి కట్టేసి లాక్కెళ్లారు.


రెండు కిలోమీటర్ల మేర విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఈ చర్యను ఎందుకు అడ్డుకోలేదని పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.Tags

Next Story