షూటింగ్స్ షురూ.. ఫిల్మ్ నగర్ లో సందడి మొదలాయె..

షూటింగ్స్ షురూ.. ఫిల్మ్ నగర్ లో సందడి మొదలాయె..
ఫిల్మ్ నగర్ లో మళ్లీ సందడి మొదలైంది.. కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన చిత్రాలన్నీ పూర్తి చేసేందుకు టాలీవుడ్ సిద్ధమైంది.

కరోనా వచ్చి అన్ని రంగాలను నియంత్రించింది. వైరస్ భయానికి ఎక్కడి వారక్కడ గప్ చుప్ గా ఉన్నారు. షూటింగ్స్ లేక బిజీగా ఉండే తారలంతా అయిదు నెలలుగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ రావడంతో కాస్త ధైర్యం చేసి చిత్రీకరణలు మొదలు పెట్టాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.. ఇప్పటికే కొన్ని సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. యశ్ నటిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2, నాగార్జున.. వైల్డ్ డాగ్, సాయితేజ్.. సోలో బ్రతుకే సో బెటరు తదితర చిత్రాల షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా.. మరిన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌.. నిర్మాతగా చేస్తున్న వివాహ భోజనంబు చిత్రాలు చిత్రీకరణ మంగళవారం ప్రారంభమయ్యాయి.

నాగచైతన్య-శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ ఈ నెల 7 నుంచి ప్రారంభమవుతుంది. చైతూ తరువాతి చిత్రం థ్యాంక్యూ ఈ నెలాఖరు నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ రాధేశ్యాం కూడా చిత్రీకరణకు సన్నాహాలు మొదలుపెట్టింది.

సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం ఈనెల రెండో వారం నుంచి పట్టాలెక్కనుంది.

గోపీచంద్-సంపత్ నంది కలయికలో వస్తున్న సిటీమార్ ఈనెల మూడో వారం నుంచి మొదలవనుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా తెలుగు తెరకు పరిచయమవుతోంది.

మరి కొన్ని చిత్రాలు రవి తేజ.. క్రాక్, నాని.. టక్ జగదీష్, అల్లు అర్జున్.. పుష్ప లాంటి చిత్రాలన్నీ ఈనెల్లోనే షూటింగ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి.

ఇప్పటికే 70 శాతం పూర్తయిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కీలక ఎపిసోడ్లు చిత్రీకరించాలంటే వందల మంది సిబ్బంది అవసరమవుతుందట. కరోనా నేపథ్యంలో అంతమంది మధ్య షూటింగ్ జరపడం కష్టం కనుక కొంత ఆలస్యంగా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటోంది ఆర్ఆర్ఆర్ యూనిట్.

Tags

Read MoreRead Less
Next Story