శ్రియా, క్రిష్ ల 'గమనం'

శ్రియా, క్రిష్ ల గమనం
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్.

అందం, అభినయం కలబోతతో సినిమాల్లో సక్సెస్ అయిన శ్రియా శరణ్ కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా మరో చక్కని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ సినిమాలకు రెగ్యులర్ కెమెరామెన్ అయిన సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేకర్ వి.ఎస్. గత ఏడాది నటి శ్రియాతో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను శ్రియా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. కొత్తగా వచ్చిన సుజన రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'గమనం' అని పేరు పెట్టారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో శ్రియా కనిపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. పోస్టర్‌లో శ్రియా నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్. రమేష్ కరుటూరి, వెంకి పుషాదపుల సహకారంతో జ్ఞాన శేకర్ విఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీన్ని ఒటిటిలో విడుదల చేయాలని బృందం యోచిస్తోంది.

Tags

Next Story