Siachen: ఇండో-చైనా బోర్డర్ తొలి మహిళా ఆఫీసర్... మైనస్ 60 డిగ్రీల వద్ద గస్తీ...
Siachen

మహిళా శక్తికి ఎల్లలు లేవని నిరూపిస్తోంది రాజస్థాన్ కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్. అత్యంత క్లిష్టమైన ప్రాంతంగా పేరుగాంచిన సియాచిన్ లో డిప్లాయిమ్మెంట్ అయిన శివ మూడు నెలలపాటూ ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వహించబోతోంది. ఈ ఘనత సాధించిన తొలి మహిళ అధికారిగానూ రికార్డ్ సృష్టించింది.
భారత సైన్యంలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కు చెందిన శివ చౌహాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ ప్రాంతంలో విధులు నిర్వహించబోతోంది. సముద్రమట్టానికి 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్ కు డిప్లాయ్ అయిన ఉక్కు మహిళ..ప్రస్తుతం విధుల నిర్వహణలో తలమునకలైంది. మరో మూడు నెలలపాటూ అదే ప్రాంతంలో తన సహచరులతో పాటూ గస్తీ నిర్వహించనుంది.
వివిధ విభాగాల్లో అత్యంత క్లిష్టమైన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న శివ, జనవరి 2న ఫ్రంట్ లైన్ వారియర్ గా విధుల్లో చేరింది. రాజస్థాన్ లోని సాపర్ బృందాని నాయకత్వం వహించిన శివ అనేక యుద్ధ ప్రక్రియల్లో రాటుదేలింది. ఇక విధుల్లోకి జాయిన్ అయిన దగ్గర నుంచి చౌహాన్ పోస్ట్ చేస్తున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైనస్ 60డిగ్రీల వాతావరణంలో ముక్కోవని ధైర్యంతో గస్తీ కాస్తున్న శివ్ చౌహాన్... ఎందరికో ఆదర్శమనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com