మధ్యప్రదేశ్ ఘోర ప్రమాదం : 45కి చేరిన మృతుల సంఖ్య...!

మధ్యప్రదేశ్ ఘోర ప్రమాదం : 45కి చేరిన మృతుల సంఖ్య...!
మధ్యప్రదేశ్‌లో అదుపు తప్పి కాల్వలోకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. వీరిలో 24 మంది పురుషులు, 20మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు అధికారలు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో అదుపు తప్పి కాల్వలోకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. వీరిలో 24 మంది పురుషులు, 20మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు అధికారలు తెలిపారు. ఈ ఉదయం సిధి జిల్లాలోని పట్నా గ్రామం సమీపంలో బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనా సమయంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నీటిలో మునిగిసోయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

రెవా నుంచి సిధికి వెళ్తుండగా పట్నా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు.. వంతెనపై నుంచి బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అటు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం.. 2లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి 50వేలు చొప్పున పరిహారం ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story