Sikkim: మంచు తుఫాను...ఆరుగురు మృతి

X
By - Chitralekha |4 April 2023 4:45 PM IST
సిక్కింలో మంచు తుఫాను, చిన్నారి సహా ఆరుగురి మృతి
సిక్కింలో మంచు తుఫాను సృష్టించిన భీభత్సానికి ఆరుగురు మృతిచెందారు. ట్సోంగో ల ో ఒక్కసారిగా దుసుకువచ్చిన మంచు తుఫాను ధాటికి టూరిస్టు బస్సు లోయలోకి జారిపోయింది. నలుగురు పురుషులతో పాటు ఓ మహిళ, ఆమె చిన్నారి ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీ సహాయంతో త్వరితగతిన మంచును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com