కొత్త మోసం.. 'సిమ్ స్వాప్' ద్వారా రూ.19 లక్షలు గోవిందా

కొత్త మోసం.. సిమ్ స్వాప్ ద్వారా రూ.19 లక్షలు గోవిందా
తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి

అకౌంట్లో డబ్బులు ఏదో విధంగా స్వాహా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. ఇక ఎక్కడ సేఫ్‌గా ఉంటాయో తెలియక తల పట్టుకుంటున్నారు వ్యాపారస్తులు. సిమ్ స్వాపింగ్ ద్వారా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయకులను టార్గెట్‌గా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి సంబంధించిన రూ.19 లక్షలు కాజేశారు.

ఎలక్ట్రికల్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తకు సంబంధించిన మొబైల్ సిమ్‌కార్డు ఈ నెల 6న బ్లాక్ అయింది. కస్టమర్‌కేర్‌ను సంప్రదించగా నెట్‌వర్క్ సమస్య ఉండొచ్చని చెప్పారు. వ్యాపారి సిమ్ కార్డ్ విషయాన్ని మర్చిపోయాడు. ఉన్నట్టుండి ఓరోజు అకౌంట్‌లో నుంచి రూ.19 లక్షలు మాయం అయ్యాయి. ఎంక్వైరీ చేస్తే అంత డబ్బుని నేరగాళ్లు సిమ్ స్వాపింగ్ ద్వారా తస్కరించినట్లు గుర్తించారు.. ఈ మేరకు వ్యాపారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags

Next Story