Simla : హిందూ దేవాలయంలో ముస్లిం జంటకు పెళ్లి

Simla : హిందూ దేవాలయంలో ముస్లిం జంటకు పెళ్లి
ఆలయ ప్రాంగణంలో నిఖా; మత సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని తెలియజేసేందుకే....

సిమ్లాలోని ఓ హిందూ దేవాలయంలో ముస్లిం జంటకు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. మతసామరస్యానికి ప్రతీకగా ఈ వేడుక నిలిచింది. వివాహ వేడుక జరిగిన దేవాలయాన్ని విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందినదిగా ఉండటం గమనార్హం. ఆలయంలో జరిగిన ఈ వివాహాన్ని ముస్లిం, హిందూ సంఘాలు తిలకించాయి. ఆలయ ప్రాంగణంలో మౌల్వీ, సాక్షులు, న్యాయవాది సమక్షంలో నిఖా జరిగింది. మత సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఆలయంలో నిఖా జరిపించినట్లు తెలిపారు నిర్వాహకులు.

ఠాకూర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ట్రస్ట్ రాంపూర్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... "విశ్వహిందూ పరిషత్ ఆలయాన్ని నిర్వహిస్తొంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా కార్యాలయాన్నినిర్వహిస్తొంది. అయితే వీహెపీ, ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమని ప్రచారం సాగుతోంది. అది నిజం కాదు. అందుకు పైరెండు సంస్థలు నిర్వహిస్తున్న ఆలయంలోనే ముస్లిం జంటకు వివాహం చేయడమే నిదర్శనం" అని శర్మ అన్నారు.



Tags

Read MoreRead Less
Next Story