11 Sep 2020 8:25 AM GMT

Home
 / 
జాతీయం / మీ హృదయం పదిలంగా.....

మీ హృదయం పదిలంగా.. పదికాలాల పాటు ఉండాలంటే..

గుండె పనితీరు బాగుంటేనే శరీంలోని అవయవాలన్నింటికి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మరి ఆ గుప్పెడంత గుండెను కాపాడుకోడానికి

మీ హృదయం పదిలంగా.. పదికాలాల పాటు ఉండాలంటే..
X

మీ మనసుకు నచ్చిన పని చేస్తున్నారు.. మరి మీ హృదయాన్ని మాత్రం ఎందుకు బాధపెడుతున్నారు.. గుండె ఒత్తిడికి గురైతే హృదయ స్పందనలు లయ తప్పుతాయి.. వాహనానికి ఇంజన్ ఎంత ముఖ్యమో.. మనిషికి గుండె అంతే ముఖ్యం. గుండె పనితీరు బాగుంటేనే శరీంలోని అవయవాలన్నింటికి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మరి ఆ గుప్పెడంత గుండెను కాపాడుకోవడానికి మనమేం చెయ్యాలి..

మీ గుండె వేగంగా కొట్టుకుంటోందంటే, మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. హృదయ స్పందన రేటు నిమిషానికి 100 బీట్ల కంటే ఎక్కువ వుంటే మీ శరీరానికి రక్తం సరఫరా చేయడానికి మీ గుండె అదనపు కృషి చేస్తోంది అని అర్థం. ఆ అదనపు ప్రయత్నం మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ముఖ్యమైనది కళ్లు బైర్లు కమ్మడం, అలసట వంటివి. ఒక్కోసారి ఇవి తీవ్రంగా ఉండి రక్తం గడ్డకట్టడం, గుండె ఆగిపోవడంతో పాటు అరుదైన సందర్భాల్లో ఆకస్మిక మరణం కూడా సంభవిస్తుంది.

విశ్రాంతిగా ఉన్నప్పుడు హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్ల మధ్య ఉంటుంది. మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూసుకోవడం చాలా సులభం. విశ్రాంతిగా ఉన్నప్పుడు మీ మణికట్టు మీద బొటనవేలు ఉంచి ఒక నిమిషం పాటు బీట్ల సంఖ్యను లెక్కించండి - అది మీ హృదయ స్పందన రేటు.

ఈ హృదయ స్పందన రేటు అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. వయస్సు రిత్యా కూడా గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం జరుగుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటుందంటే అది అనారోగ్య లక్షణంగా పరిగణించి వైద్యుడిని సంప్రదించడం ప్రధమ కర్తవ్యం.

1. వేసవి కాలంలో ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. ఆ వేడికి శరీరం తట్టుకోలేక మీ గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. చర్మం ఉపరితలంపై రక్తాన్ని పంప్ చేయడానికి, చెమటను ఉత్పత్తి చేసి శరీరాన్ని చల్లబరచడానికి మీ గుండె వేగంగా పనిచేస్తుండటం దీనికి కారణం. మీ గుండె మీద ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నించాలి.

2. గుండె పనితీరుకు, ఆరోగ్యానికి వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం. వ్యాయామం ద్వారా హృదయ స్పందన సాధారణంగా ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది ప్రతికూల అంశంగా అనిపించినప్పటికీ, వ్యాయామం చేస్తున్న ప్రతిసారీ రక్తాన్ని పంపింగ్ చేయడంలో గుండె సమర్థవంతంగా పనిచేస్తుంది.

3. ఆహారంలో చేపలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ఆహారంలో ఎక్కువగా చేపలను చేర్చడం వలన గుండె పనితీరు మెరుగుపడుతుంది. శాఖాహారం తీసుకునే వారు కనీసం ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించాలి. దీని గురించి ఒకసారి డాక్టర్ తో సంప్రదించి తీసుకుంటే మంచిది.

4. ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉంటే హృదయ స్పందన రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి, ఒత్తిడి అనివార్యంగా అనిపిస్తుంది. ఆఫీస్ పనిని, ఇంటి పనిని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో అనేక మంది ఒత్తిడికి గురవుతుంటారు. దీని ప్రభావం గుండెమీద పడుతుంది.

5. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం, వదలడం వంటి శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయడానికి ప్రతిరోజూ ఐదు, పది నిమిషాలు కేటాయించాలి.

6. ధూమపానం చేయడం ఒక వ్యక్తి ఆరోగ్యంపై లెక్కలేనన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఊపిరితిత్తులు, ఇతర క్యాన్సర్ వంటి వ్యాదులు రావడానికిఆస్కారం ఉంటుంది. పొగాకు ఉత్పత్తులు హృదయ స్పందన రేటును పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. సిగరెట్ పొగ ద్వారా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు, ధమనులు సంకోచించబడి గుండెకు అదనపు భారాన్ని కలిగిస్తాయి.

Next Story