Singapore Variant: కేజీవాలపై సింగపూర్ మంత్రి మండిపాటు
Singapore Variant: సింగపూర్ వేరియంట్ భారత్ లోకి వచ్చే అవకాశం ఉందని, ఇది పిల్లలకు వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ చేసిన వ్యాఖ్యలపై సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్ బాలకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు వాస్తవాలకు కట్టుబడి ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. సింగపూర్ వేరియంట్ అంటూ ఏ వేరియంట్ లేదన్నారు.
అంతకుముందు కేజ్రీవాల్ ఇచ్చిన ట్వీట్‌లో సింగపూర్‌లో కొత్త కొవిడ్-19 వేరియంట్ వ్యాపిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమైనదని, దీనివల్ల చిన్న పిల్లలకు అపాయమని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో కొవిడ్ మూడో ప్రభంజనం రావచ్చునని హెచ్చరించారు. వెంటనే సింగపూర్‌నకు విమానాల రాకపోకలను నిలిపేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అటు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. కేజ్రీవాల్ భారత్ తరఫున మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com