జాతీయం

Plastic Ban: ప్లాస్టిక్ బ్యాన్.. జులై 1 నుంచి షురూ..

Plastic Ban: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తయారు చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం మరియు ఉపయోగించడం పై నిషేధం విధించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Plastic Ban: ప్లాస్టిక్ బ్యాన్.. జులై 1 నుంచి షురూ..
X

Plastic Ban: తక్కువ వినియోగం, ఎక్కువ చెత్త పోగయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించింది. జులై 1 నుండి దేశవ్యాప్తంగా నిషేధం విధించనుందని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వచ్చే నెల నుండి నిషేధించబడే వస్తువుల జాబితాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తయారు చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం మరియు ఉపయోగించడం పై నిషేధం విధించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జూలై 1 నుంచి నిషేధించాల్సిన వస్తువులు:

బెలూన్ స్టిక్స్

సిగరెట్ ప్యాకెట్లు

ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, ట్రే

ఇయర్‌బడ్స్

స్వీట్ బాక్స్‌లు

ఆహ్వాన కార్డులు

PVC బ్యానర్‌లు 100 మైక్రాన్‌ల కంటే తక్కువ ఉన్నవాటిని

జూలై నుంచి ప్లాస్టిక్ నిషేధం ఎలా అమలులోకి వస్తుంది?

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని CPCB మరియు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు (SPCBలు) పర్యవేక్షిస్తాయి. ఇవి రోజూ కేంద్రానికి నివేదికలు సమర్పిస్తాయి. నిషేధిత వస్తువులలో నిమగ్నమై ఉన్న పరిశ్రమలకు ముడిసరుకులను సరఫరా చేయకూడదని CPCB జాతీయ, రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలలో ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఒకసారి ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. పెట్రో కెమికల్ సంస్థలు కూడా ప్లాస్టిక్ వస్తువుల తయారీకి సంబంధించిన ముడిసరకును సరఫరా చేయరాదని ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

Next Story

RELATED STORIES