బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివిస్తా: హీరో కార్తికేయన్..

బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివిస్తా: హీరో కార్తికేయన్..
కష్టం లో ఉన్నప్పుడు సానుభూతి మాటల కంటే సాయం చేసే చేతులు ఎంతో అవసరం.

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన తమిళనటుడు వడివేల్ బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కానీ హీరో శివకార్తికేయన్ మాత్రం బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు.. దీంతో తమిళ ప్రజలు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. నిజమైన హీరో కార్తికేయన్ అని అభిమానులు ఉప్పొంగి పోతున్నారు.. బాలాజీ ఆత్మకు శాంతి కలిగే మంచి మాట చెప్పారు మా హీరో అని అంటున్నారు..

బాలాజీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కలకపోవతు యారు దర్శకుడు థామ్సన్ తో శివకార్తికేయన్ మాట్లాడి, నటుడి మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీ ఇద్దరు పిల్లల విద్యా ఖర్చులకు నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. విజయ్ సేతుపతి, రోబో శంకర్, దివ్యదర్శిని వంటి సినీ ప్రముఖులు వడివేల్ బాలాజీ ఇంటికి వెళ్లినివాళులర్పించి అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. వడివేల్ బాలాజీ గుండెపోటుతో 15 రోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా అనేక ఆసుపత్రులకు మారిన తరువాత, నటుడు చివరకు ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచాడు. వడివేల్ బాలాజీకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా,నయనతారా నటించిన నెల్సన్ దిలీప్‌కుమార్ కోలామావు ​​కోకిలాలో శివకార్తికేయన్ మండ్రాం తైలైవర్ పాత్రను పోషించాడు.

Tags

Read MoreRead Less
Next Story