ఆ ఆరు రోజులు అత్యంత దుర్భరం: రవిచంద్రన్ అశ్విన్

ఆ ఆరు రోజులు అత్యంత దుర్భరం: రవిచంద్రన్ అశ్విన్
క్వారంటైన్ లో గడిపిన ఆ ఆరోజులు తన జీవితంలో అత్యంత చెత్త రోజులుగా రవిచంద్రన్ అభివర్ణించాడు.

ఇంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేర్చుకున్నాయి. టీమిండియా దుబాయ్‌కు చేరుకోవడంతో, ఐపీఎల్ 13 కంటే ముందు, అతను ఆరు రోజులు నిర్బంధంలో ఉండాలి. క్వారంటైన్ లో గడిపిన ఆ ఆరోజులు తన జీవితంలో అత్యంత చెత్త రోజులుగా రవిచంద్రన్ అభివర్ణించాడు. ఇదే విషయాన్ని యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. "నేను గత ఐదారు నెలలుగా ఇంట్లో ఉన్నాను, అయినా బిజీగానే గడిపాను.. నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో నా స్వంత పనిని చేస్తున్నాను, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాను. కానీ దుబాయ్ హోటల్ రూమ్ లో గడిపిన ఆరురోజులు చాలా చెత్తగా అనిపించింది.

"ఎందుకంటే మొదటి రోజు హోటల్ బాల్కనీ నుంచి సరస్సును చూస్తూ గడిపాను. అక్కడి నుంచే బుర్జ్ ఖలీఫాను కూడా చూశాను. అద్భుతంగా అనిపించింది కాని బయట ఎంతసేపు కూర్చుని చూడగలం. అయినా ఇక్కడ చాలా వేడిగా ఉంది అని అశ్విన్ యూట్యూబ్ వీడియోలో తెలిపారు.

దుబాయ్‌లో ఒంటరిగా గడిపిన ఆ ఆరు రోజులు అశ్విన్ తన మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించానని, పుస్తకాలు చదవడానికి తగినంతగా దృష్టి పెట్టలేదని చెప్పుకొచ్చాడు. "సాధారణంగా నేను మొబైల్ ఫోన్‌ను చూడను, ఎక్కువసేపు దాన్ని ఉపయోగించను. గత వారం రోజుల్లో మొత్తం ఆరుగంటలు మొబైల్ వాడాను. అది నా దృష్టిలో చాలా ఎక్కువ అని చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story