Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెల్లు.. అందరికీ ఒకే మండపంలో..

Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెల్లు.. అందరికీ ఒకే మండపంలో..
Rajasthan: ఒకప్పుడు అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు అందరికీ ఒకేసారి పెళ్లిళ్లు చేసేవారు.

Rajasthan: ఒకప్పుడు అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు అందరికీ ఒకేసారి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసే పద్ధతే మారిపోయింది. అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు కలిసి పెళ్లి చేసుకోవడం మానేశారు. కానీ చాలాకాలం తర్వాత రాజస్థా్న్‌లో అక్కాచెల్లెల్లు అందరూ ఒకేరోజు, ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఝన్‌ఝన్ జిల్లాలోని ఖేతడీ గ్రామంలో పనిచేసే ఓ బస్సు డ్రైవర్‌కు ఆరుగురు కూతుళ్లు, ఒక కొడుకు. అయితే తన ఆరుగురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి వయసు రావడంతో ఆ తండ్రి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అందరికీ వేర్వేరుగా పెళ్లి చేయడం ఎందుకు అని అందరికీ ఒకేరోజు, ఒకే మండపంలో పెళ్లిళ్లు చేశాడు.

అంతే కాకుండా ఆరుగురు అక్కాచెల్లెల్లకు ఆరు కుటుంబాల నుండి పెళ్లికొడుకులను వెతకడం ఎందుకు అని.. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములకు ఇద్దరు అక్కాచెల్లెల్లను ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరగడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతే కాక ఈ అక్కచెల్లెల్ల పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా.

Tags

Read MoreRead Less
Next Story