15 May 2022 3:15 PM GMT

Home
 / 
జాతీయం / Bihar : బీహార్ ...

Bihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!

Bihar : నలంద జిల్లాలో పర్యటించిన బీహర్ సీఎం నితీష్ కుమార్‌‌ దగ్గరికి ఆరో తరగతి చదువుతున్న సోనూకుమార్ అనే ఓ 11 ఏళ్ల బాలుడు దైర్యంగా వెళ్లి తన మొర వినిపించాడు..

Bihar :  బీహార్  సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
X

Bihar : నలంద జిల్లాలో పర్యటించిన బీహర్ సీఎం నితీష్ కుమార్‌‌ దగ్గరికి ఆరో తరగతి చదువుతున్న సోనూకుమార్ అనే ఓ 11 ఏళ్ల బాలుడు దైర్యంగా వెళ్లి తన మొర వినిపించాడు.. పెరుగు అమ్ముతున్న తన తండ్రి డబ్బునంతా మద్యానికే ఖర్చు పెడుతున్నాడని, స్కూల్ ఫీజులకు తనకి ఏమీ ఇవ్వడం లేదని ఆ యువకుడు సీఎం దగ్గర వాపోయాడు.. తనకి చదువుకోవాలని ఉందని, నాణ్యమైన విద్యని అందించాలాని సీఎంకి విజ్ఞప్తి చేశాడు.

మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చేర్పించండి అని తెలిపాడు. ఇంగ్లీషు చదువులంటే స్కూల్ టీచర్లు భోదించడం లేదని తెలిపాడు. ప్రభుత్వం సహాయం చేస్తే బాగా చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ఉందని అని చిన్నారి సీఎంకి వెల్లడించారు ఆ బుడ్డోడు.. అయితే దీనిపైన సానుకూలంగానే స్పందించిన సీఎం.. అక్కడున్న అధికారిని పిలిచి ఆ బాలుడి చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని ఆదేశించారు.

దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా సీఎం నితీశ్ కుమార్ తన భార్య దివంగత మంజు సిన్హా 16వ వర్ధంతి సందర్భంగా కళ్యాణ్ విఘా గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నితీశ్‌ కుమార్‌ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను విన్నారు. అటు బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే.

Next Story