Smriti Irani: పెళ్లాం పని అదే! ఆసక్తిరేకెత్తిస్తోన్న ఇరానీ ఇన్స్టా పోస్ట్
Delhi

Smriti Irani: పెళ్లాం పని అదే! ఆసక్తిరేకెత్తిస్తోన్న ఇరానీ ఇన్స్టా పోస్ట్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు . ఏ విషయాన్ని చెప్పాలన్న తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునేలా చెప్తారని తెలిసిందే. కొన్ని సార్లు ఆమె పోస్టులు మనసు హత్తుంటాయని అంటుంటారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో ఆమె తాజా పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై తన మనసులోని మాటలను షేర్ చేసుకునే స్మృతీ ఇరానీ తాజాగా పెట్టిన పోస్టు పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అటు భార్యగా ఇటు మంత్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్న ఇరానీ వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేసింది.
సూపర్ మార్కెట్ లో సరుకులు కొంటూ కెమెరాను క్లిక్ మనిపించిన స్మృతి 'ఇదే పెళ్లాం జీవితం' అంటూ క్యాప్షన్ ఇచ్చేసరికి ప్రస్తుతం ఈ ముచ్చట వైరల్ గా మారింది. వయసు పెరిగేకొద్దీ విహారయాత్రలపై మోజు తగ్గి, ఇంటిపైన ధ్యాస పెరుగుతుందంటూ ఫొటోతో పాటూ మరో సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది.
ఇక ఇండస్ట్రీలో ఆమె సన్నిహితుల సైతం స్మృతి పోస్ట్ కు లైకులతో పాటూ కామెంట్లు కూడా జత చేస్తున్నారు. బాలాజీ టెలీఫిల్మ్ అధినేత ఏక్తా కపూర్ 'నా స్నేహితురాలు మాస్క్ లో భలే అందంగా ఉందం'టూ కామెంట్ చేసింది. ఇక మరింత మంది నెటిజెన్లు స్మృతి సెన్స్ ఆఫ్ హ్యూమర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com