Smriti Irani Monday Motivation: మండేను తీస్కపోరాదూ.....!

వీకెండ్ వెళ్లిపోయింది. మండే అప్పుడే సగం గడిచిపోయింది. కానీ, వర్కింగ్ మూడ్ లోకి జనాలు ఇంకా ఎంటర్ అవ్వలేదనే చెప్పాలి. మన పరిస్థితే ఇలా ఉందేంటి అని అస్సలు దిగులుపడకండి. మహామహులకు సైతం మండే అంటే ఎక్కడలేని నీరశం వచ్చేస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఇదే విధంగా వీకెండ్ మూడ్ ను విడిచిపెట్టేందుకు ఇబ్బంది పడుతున్నారట. ఇదే విషయాన్ని ఇన్స్టాలో ఓ మీమ్ ద్వారా షేర్ చేసుకున్నారు. హేరాపేరీలోని ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసి డియర్ సండే మండేను కూడా తీసుకుపోరాదు అంటూ చమత్కరించారు. ఇహ ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. అందరిని బాధను ఒక్క సందేశంతో క్రోడీకరించారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఏమైనా స్మృతి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ఇదో మచ్చుతునక అని చెప్పుకోవాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com