చీర కట్టి.. పామును పట్టి..: వీడియో వైరల్

చీర కట్టి.. పామును పట్టి..: వీడియో వైరల్
ఎంతో ఆధునికంగా కనిపిస్తున్న చిట్టి.. చీరకట్టి ఎంతో ఒడుపుగా పాముని పట్టుకుంది.

ఆమెకు ఎంత ధైర్యం.. ఎంతో చాకచక్యంగా.. కొంచెం కూడా భయం లేకుండా పడగ విప్పుతున్న నాగు పామును పట్టుకుంది.. పాము పేరు వింటేనే పరిగెడతారు.. ఎక్కువగా పురుషులు పాముల్ని పట్టుకోవడం చూస్తుంటాం.. చాలా అరుదుగా ఆడవాళ్లు పాముల్ని పట్టుకున్న సంఘటనలు ఉంటాయి. గత సంవత్సరం చిత్రీకరించిన ఈ వీడియో మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిర్జారా చిట్టి అనే పాములను పట్టుకునే మహిళ.. ఓ భయంకరమైన విషసర్పాన్ని పట్టుకుని చుట్టు పక్కల వారిని ఆకర్షించింది. ఎంతో ఆధునికంగా కనిపిస్తున్న చిట్టి.. చీరకట్టి ఎంతో ఒడుపుగా పాముని పట్టుకుంది.

నిజానికి ఇలాంటి కఠినమైన సమయాల్లో చీర సౌకర్యవంతంగా ఉండదు.. పాము తిరగబడితే ఈ వస్త్రధారణతో పరిగెట్టడం కూడా కష్టం .. అయినా ధైర్యంగా చిట్టి అల్మరా వెనుక ఉన్న విషసర్పాన్ని పట్టుకోవడానికి కర్రను ఉపయోగించింది.. ఒక ఫంక్షన్ కు వెళ్లడానికి రెడీ అవుతున్న ఆమెకు ఫోన్ వచ్చింది.. పామును పట్టుకోవడానికి రమ్మంటూ.. రెస్క్యూ కాల్ అందుకున్న ఆమె వెంటనే ఓ చిన్న కర్ర సాయంతో నాగు పాముని పట్టుకుంది. ఈ వీడియోను ఆమె భర్త ఆనంద్ చిట్టి తమ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 4.5 లక్షల మంది వీక్షించారు. వీడియోని చూసిన వారు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Tags

Next Story