చలి తీవ్రత తట్టుకోలేక ఆర్మీ ఉద్యోగి రెడ్డప్పనాయుడు హఠాన్మరణం

చలి తీవ్రత  తట్టుకోలేక ఆర్మీ ఉద్యోగి రెడ్డప్పనాయుడు హఠాన్మరణం
X
చిత్తూరు జిల్లా గడ్డక్రిందపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగి మంచు రెడ్డప్పనాయుడు హఠాన్మరణం చెందారు. జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ మరణించారు.

చిత్తూరు జిల్లా గడ్డక్రిందపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగి మంచు రెడ్డప్పనాయుడు హఠాన్మరణం చెందారు. జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ మరణించారు. చలి తీవ్రతకు పల్స్‌ డౌన్‌ అయిన రెడ్డప్ప నాయుడును... చికిత్స కోసం హెలీకాప్టర్‌లో ఢిల్లీ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. 20 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న రెడ్డప్పనాయుడు. మరో మూడేళ్లలో రిటైర్‌ కానున్నారు. ఈ నెల 9న సెలవుపై ఇంటికి రావాల్సిన రెడ్డప్పనాయుడు హఠాన్మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రెడ్డప్పనాయుడు భౌతికకాయం సోమవారం గడ్డక్రిందపల్లికి చేరుకోనుంది.

Tags

Next Story