Rajasthan: అమ్మకు ప్రేమతో.. పదవీ విరమణ రోజు కొడుకు సర్‌ప్రైజ్

Rajasthan: అమ్మకు ప్రేమతో.. పదవీ విరమణ రోజు కొడుకు సర్‌ప్రైజ్
Rajasthan: రాజస్థాన్ అజ్మీర్‌‌కు చెందిన ఒక కొడుకు తన తల్లికి పదవీ విరమణ రోజు హెలికాప్టర్ రైడ్‌ని బహుమతిగా ఇచ్చాడు.

Rajasthan: రాజస్థాన్ అజ్మీర్‌‌కు చెందిన ఒక కొడుకు తన తల్లికి పదవీ విరమణ రోజు హెలికాప్టర్ రైడ్‌ని బహుమతిగా ఇచ్చాడు. మా అమ్మ టీచర్‌గా పదవీ విరమణ చేసింది. నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాను. ఇంటికి చేరుకోవడానికి ఆమెకు హెలికాప్టర్ రైడ్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. అని కొడుకు యోగేష్ చౌహాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు.. బిడ్డలు తమను ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలని అదే తమకు పెద్ద బహుమతి అని భావిస్తుంటారు.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పాఠశాల ఉపాధ్యాయురాలు సుశీలా చౌహాన్ శనివారం పదవీ విరమణ చేశారు. 33 సంవత్సరాలు పిసంగన్‌లోని కేసర్‌పురా ఉన్నత పాఠశాలలో ఆమె పనిచేశారు. కొడుకు యోగేష్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.

తల్లి రిటైర్మెంట్ అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు. పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత అమ్మను ఇంటికి తీసుకువచ్చేందుకు హెలికాప్టర్ బుక్ చేశాడు. విరమణ హెలికాప్టర్‌లో తల్లిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి యోగేష్ అధికారుల నుండి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నాడు.

అయితే, ఈ సమయంలో ఇంత మంది అక్కడ గుమికూడతారని ఊహించలేదు. కానీ ఇది మాకు చాలా సంతోషాన్నిస్తుంది అని యోగేష్ ట్వీట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story