Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా..

Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా..
X
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.

Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.జ్వరం రావడంతో గురువారం ఆస్పత్రికి తరలించగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సర్ గంగారాం హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. జ్వరం రావడంతో మార్చి 2న అంటే గురువారం అడ్మిట్‌ అయ్యారు. ఆమె నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. వైద్యులు ఆమెకు అనేక పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.

Tags

Next Story