Sonia Gandhi : సోనియా సంచలన నిర్ణయం.. కుటుంబంలో ఒక్కరికే పార్టీ టికెట్..!

Sonia Gandhi : కాంగ్రెస్ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబర్‌లో ప్రసగించిన ఆమె.... కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబంలో ఒకరికే పోటీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
సోనియా వ్యాఖ్యలతో... పార్టీని సంస్కరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.వ్యవస్థాగతంగా పార్టీలో సమూల మార్పులు జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు సోనియాగాంధీ. మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అత్యవసరమన్నది సోనియా ప్రసంగం సారాంశం.. అయితే, ఈ మార్పులు గాంధీ కుటుంబం నుంచి మొదలవుతాయా అన్న చర్చ కూడా జరుగుతోంది.
త్యాగాలకు సిద్ధమవడం అంటే సోనియా కుటుంబం నుంచే ఇది మొదలవుతుందా అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.. కుటుంబంలో ఒకరికే టికెట్ అనే విధానం అన్ని చోట్లా సాధ్యమవుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.. మరోవైపు కాంగ్రెస్‌కు నాయకత్వం ఎవరు వహిస్తున్నారన్నది కూడా తేలాల్సి ఉంది.
ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్‌లోనూ రాహుల్ నాయకత్వాన్ని ఓ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com