Sonu Sood: మరోసారి తన ఉదారత చాటుకున్న సోనూ.. 8 అవయవాలతో పుట్టిన బిడ్డకు..

Sonu Soor: హృదయాన్ని కరిగించే సంఘటనలు మనచుట్టూ ఎన్నో కళ్లముందు కనిపిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం.. కానీ సోనూ సూద్ కి ఆ పాపని చూడగానే తన హృదయం కరిగింది.. ఆపరేషన్ చేయించి అందరి పిల్లల్లానే ఆ పాప కూడా ఆడుకోవాలని తలచాడు.. ఆపరేషన్ చేయించాడు.. 8 అవయవాలతో ఉన్న బీహార్ అమ్మాయికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బీహార్ అమ్మాయి చాముఖి ఫోటోను షేర్ చేశాడు. పలువురు బాలీవుడ్ నటులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎప్పుడూ ముందుంటాడు. సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తున్నాడు.
బీహార్‌కు చెందిన రెండున్నరేళ్ల బాలిక మెరుగైన జీవితాన్ని పొందేందుకు సూద్ సహాయం చేశాడు. చౌముఖి అనే చిన్నారి బీహార్‌లోని చేవాడ జిల్లాకు చెందినది. ఆమె నాలుగు అదనపు చేతులు మరియు కాళ్ళతో జన్మించింది. దీంతో తన వయస్సులో ఉన్న ఇతర పిల్లల మాదిరిగా ఆడుకోలేదు.. బడికి వెళ్లలేదు.
చిన్నారి తల్లిదండ్రులు నవాడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. ఇటీవల తమ బిడ్డ వైద్య చికిత్సకు సహాయం కోసం SDO కార్యాలయాన్ని ఆశ్రయించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు పాప పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విషయం పాప తల్లిదండ్రులకు కూడా తెలియదు.
బాలీవుడ్ నటుడు ఈ వీడియోను చూసిన వెంటనే, చౌముఖి తల్లిదండ్రులను సంప్రదించడానికి తన బృందాన్ని నవాడకు పంపాడు. అనంతరం బాలికను శస్త్రచికిత్స నిమిత్తం సూరత్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆమె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత, చౌముఖి ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడుపుతోంది. "దేశంలోని అత్యంత కఠినమైన శస్త్రచికిత్సలలో ఒకటి విజయవంతమైంది" అనే క్యాప్షన్‌తో ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న చౌముఖి చిత్రాన్ని సోనూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినందుకు సూరత్‌లోని కిరణ్ ఆసుపత్రి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చౌముఖి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు కొత్త జీవితాన్ని అందించినందుకు సూద్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
నెటిజన్లు సోనూ సూద్ చేసిన సాయాన్ని ప్రశంసిస్తున్నారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు, "బాలీవుడ్‌లో మీరు ఉత్తమ నటుడు సార్" అని రాశారు. " సోనూ భయ్యా .. మీరు అందమైన వ్యక్తిత్వం ఉన్నవారు'' అని మరొకరు రాశారు.
చాలా మంది ప్రముఖులు సూద్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. ఈషా గుప్తా, సునీల్ శెట్టి, రిధిమా పండిట్‌లు ప్రేమపూర్వక వ్యాఖ్యలను పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com