sonu_sood: సోనూసూద్ కొత్త అవతారం.. రోడ్డు పక్కన సమోసా తింటూ..

sonu_sood: సోనూసూద్ కొత్త అవతారం.. రోడ్డు పక్కన సమోసా తింటూ..
sonu_sood: బడ్డీ కొట్టు యజమానిని పిలిచి దక్షిణాఫ్రికా వచ్చి తన కోసం సమోసా తయారు చేసి పెడతావా అని అడిగాడు.

sonu_sood: ఉత్తరాది నటుడు దక్షిణాది ప్రజల హృదయాన్ని దోచుకున్నాడు.. యాక్టర్‌గా ఎంతో మందికి తెలిసినా సేవా తత్పరుడిగా ప్రపంచం మొత్తానికి తెలిశాడు. పరిచయం అక్కరలేని వ్యక్తిగా సోనూసూద్ పేరు మార్మోగిపోతోంది. ఆపద సమయంలో ఆదుకునే ఆప్తమిత్రుడిగా, తమ హృదయాల్లో దేవుడిగా కొలుస్తుంటారు చాలా మంది సోనూసూద్‌ని.

నటుడిగా, సామాజిక కార్యకర్తగా బిజీగా ఉంటూనే ఇప్పుడు కొత్తగా బుల్లితెర పాపులర్ షో రోడీస్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. షోలో భాగంగా సోనూ షోలో పాల్గొంటున్న సభ్యులందరినీ తీసుకుని దక్షిణాఫ్రికా వెళ్లారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే సోనూ అక్కడ రోడ్‌సైడ్ ఉన్న ఓ బడ్డీ కొట్టులో సమోసాలను టేస్ట్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోడీస్‌తో నా జీవితంలో కొత్త సాహసం మొదలవుతుంది. ఈ ప్రయాణం అలాంటిదే అవుతుంది అని అతడు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. వీడియోలో అందరికీ హాయ్ చెబుతూ.. నేను ప్రస్తుతం మోఘాలో ఉన్నాను.

ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే నేను సమోసా స్టాల్లో ఉన్నాను. రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్ చేయబోతున్నాను.. ఈ సీజన్‌లో చాలా మస్తీ అడ్వెంచర్‌లు ఉంటాయి. షోని హోస్ట్ చేయడానికి వెళ్లే ముందు ఇక్కడ సమోసా తినాలనిపించింది.

మీరు కూడా అక్కడ తింటూ ఉంటారు కదా.. అందుకే నాక్కూడా ఇక్కడ తినాలనిపించింది. ఇంతలోనే స్టాల్ యజమానిని పిలిచి దక్షిణాఫ్రికా వచ్చి తన కోసం సమోసా తయారు చేసి పెడతావా అని అడిగాడు. అతడు అందుకు ఓకే అని అనడంతో.. ఇంకేం అక్కడ కూడా మేం సమోసా తినొచ్చు అని ఆనందం వ్యక్తం చేశారు. రోడీస్ చూసేందుకు సిద్ధంగా ఉండండి అని వీడియోలో తెలిపాడు.

సోనూ పోస్ట్ చేసిన వీడియోని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ అభిమాని మీరు గ్రేట్ సర్ అని కామెంట్ చేశాడు. మరొకరు మీరు చాలా మంచి వారు అని అంటే.. ఇంకొకరు ఇది చాలా మంచి వీడియో భయ్యా అని వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story