క్రీడాకారుడికి సోనూ సాయం..

క్రీడాకారుడికి సోనూ సాయం..
ఆపదలో ఉన్న వారికి ఓ చిన్న సాయంచేస్తే ఎంతో తృప్తి లభిస్తుంది. మరి సాయంలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న సోనూ ఇంకెంత

ఆపదలో ఉన్న వారికి ఓ చిన్న సాయంచేస్తే ఎంతో తృప్తి లభిస్తుంది. మరి సాయంలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న సోనూ ఇంకెంత ఆనందంగా ఉండి ఉంటారో. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇప్పుడు ఆ ఫలాలలను ఆస్వాదిస్తున్నారు.. సినిమాల్లో, యాడ్ షూట్స్ లో నటించి డబ్బు, పేరు సంపాదించినా తన సాయం కోరి వచ్చిన వారిని కాదనకుండా సాయం చేసి అంతకంటే మంచి పేరు సంపాదించుకుంటున్నారు సోనూ. తాజాగా ఒలింపిక్స్ కు శిక్షణ పొందుతున్న ఓ క్రీడాకారుడికి, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థికి అండగా నిలిచారు.

మనోజ్ అనే క్రీడాకారుడు ఒలింపిక్స్ లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకు అవసరమైన రన్నింగ్ షూ తనవద్ద లేకపోవడంతో తన స్నేహితులను అడిగి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, షూ సాయం చేయమంటూ మనోజ్.. సోనూకి ట్వీట్ చేశాడు. దాంతో వెంటనే స్పందించిన సోనూ.. ఈ రోజే నీకు బూట్లు అందుతాయి అని ట్విట్టర్ లో జవాబిచ్చారు. గోవింద్ అగర్వాల్ అనే మరో యువకుడు.. తన సోదరి సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతోందని ఆమెకు చదువుకోవడానికి తగిన పుస్తకాలు పంపించమని సోనూని కోరాడు.. వారికి కూడా సోనూ రిప్లై ఇస్తూ.. మీకు పుస్తకాలు రేపటికల్లా అందుతాయి అని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story