Sonu Sood: గ్రామ సర్పంచుల కోరిక మేరకు సోనూసూద్..

Sonu Sood: ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుగా అందరికీ సోనూసూద్ గుర్తొస్తున్నారు. సినిమా నటుడిగా అంత పాపులారిటీ వచ్చిందో లేదో కానీ గొప్ప మానవతావాదిగా మాత్రం ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసి నెల్లూరు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఊపిరినందిస్తున్నారు. తాజాగా డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులు కావాలని గ్రామ సర్పంచులు సోనూసూద్ ని కోరారు. వీలైనంత త్వరలో అందుబాటులో ఉంచుతామని వారికి హామీ ఇచ్చారు.
సంకిరెడ్డిపల్లి, ఆషాపూర్ బోంకూర్ , ఓర్వకల్, మద్దికెర మరియు ఇతర గ్రామాల్లో మృతదేహాల సంరక్షణ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామల ప్రజలు సమీప నగరం నుంచి ఫ్రీజర్ బాక్సులు తీసుకు వచ్చి మృతదేహాలు కుళ్లిపోకుండా చేసేందుకు కష్టపడుతున్నారు.
అయితే ఫ్రీజర్ బాక్సులు ఆలస్యంగా దొరకడం లేదా అసలు దొరక్కపోవడం జరుగుతోంది. ఈ క్రమంలో డెడ్ బాడీ కుళ్లిపోతుండడంతో బంధువులకు చివరి చూపు కరువయ్యేది. సహాయం కోసం గ్రామ సర్పంచులు సోనూసూద్ ను సంప్రదించగా ఎంపిక చేసిన గ్రామాలకు వీలైనంత త్వరగా డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచుతామని సోనూ హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com