Malvika Sood : వెనుకంజలో సోనూసూద్ సిస్టర్..!

Malvika Sood : పంజాబ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అధికారం చేపట్టే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతోంది.. ఇప్పటికే ఆప్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 117 స్థానాలకి గాను 60 చోట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి అమన్‌దీప్ కౌర్ అరోరా 6,788 ఓట్లతో ముందంజలో ఉన్నారు.. అకాలీ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మఖన్ బ్రార్ 4,775 ఓట్లతో రెండో స్థానంలో, మాళవికా సూద్ 4,490 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మోగా అసెంబ్లీ స్థానంలో ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా అక్కడ 10 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో హర్జోత్ సింగ్ కమల్ విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com