డోలీ మోసిన కూలీలకు బాలు..

గాయకుడిగా, నటుడిగా, సంగీతదర్శకుడిగా బాలు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన గొంతు అలసిపోయింది. నింగికెగసిన గాన గంధర్వుడు బాలు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్థత్వం, అందరి పట్లా అదే ప్రేమా, ఆప్యాయతలు కనబరిచేవారు. ఓసారి ఆయన అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల వెళ్లారు. అక్కడ చినపాదం నుంచి ఎవరైనా సరే నడుచుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్లాల్సిందే.
అలా నడవలేని వారి కోసం అక్కడ డోలి అందుబాటులో ఉంటుంది. అంతదూరం నడవలేని బాలు డోలీ సహాయం తీసుకోవాలనుకున్నారు. డోలీ ఎక్కేముందు డోలీ మోసే కూలీల కాళ్లకు ఎస్పీ పాదాభివందనం చేశారు. ఆయన వినమ్రతకు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. బాలు ఔన్నత్యాన్ని ప్రశంసించారు. తనకు స్వామి వారి దర్శనం చేయిస్తున్న కూలీలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com