శ్రీవారి భక్తులకు శుభవార్త.. ప్రత్యేక దర్శన టికెట్లను పెంచిన టిటిడి

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ప్రత్యేక దర్శన టికెట్లను పెంచిన టిటిడి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులకోసం గురువారం నుంచి ఆన్ లైన్ కోటాను పెంచుతున్నట్లు ప్రకటించింది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు మరి కొంత మంది భక్తులకు అనుమతి కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు గురువారం నుంచి ఆన్ లైన్ కోటాను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం, రోజుకు సుమారు 6,750 దర్శన టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉంచబడ్డాయి. 3,000 టిక్కెట్లు (స్పెషల్ ఎంట్రీ దర్శన్) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా, మిగిలిన 3,750 టికెట్లు తిరుపతిలోని టిటిడి కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడతాయి. తాజా నిర్ణయంతో, ఆన్‌లైన్ కోటా రోజుకు 6,000 టిక్కెట్లకు పెరిగింది. భక్తుల సౌలభ్యం కోసం, టికెట్ల వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో 250 టిక్కెట్లు అదనంగా గంట ప్రాతిపదికన అందుబాటులో ఉంచబడ్డాయి .

ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటున్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది. స్వామి వారి సేవ చేసుకున్న భక్తులు 90 రోజుల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story