బాలు ప్రేమ వివాహం..

బాలు ప్రేమ వివాహం..
కొద్ది మంది స్నేహితులతో వచ్చి, తాను ప్రేమించిన సావిత్రిని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారని వివరించారు.

ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం వివాహం సింహాచలంలో జరిగింది. ఆయన పెళ్లి రోజు నాటి సంగతులను విశ్రాంత పర్యవేక్షణాధికారి పాశర్ల సూర్యనారాయణ గుర్తు చేసుకున్నారు. కొండదిగువన పుష్కరిణి సత్రం ప్రాంగణంలో 1969 సెప్టెంబరు 5న బాలసుబ్రహ్మణ్యం పెళ్లి జరిగిందని చెప్పారు. కొద్ది మంది స్నేహితులతో వచ్చి, తాను ప్రేమించిన సావిత్రిని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారని వివరించారు. అనంతరం పెళ్లి బట్టలతో సింహగిరిని చేరుకుని వరహాలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారని అన్నారు.

ఆ సమయంలో అక్కడ గుమస్తాగా విధులు నిర్వహిస్తున్న తనను కలిసి దేవుడికి కట్నంగా రూ.100 చెల్లించి రశీదు తీసుకున్నారని ఆయన తెలిపారు. రశీదు పొందిన తరువాత స్వామి వారి సన్నిధిలో ఇద్దరు దండలు మార్చుకుని స్వామికి పూజలు చేసి వెళ్లారన్నారు. ఆ తరువాత బాలు పినతండ్రి వచ్చి వాకబు చేసినట్లు పాశర్ల తెలిపారు. సింహాచల సిబ్బంది ఆ నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ బాలు మృతికి సంతాపం ప్రకటించారు.

Tags

Next Story