Sree Ram Sena: ఇస్లాం యువతులను చెరపడితే...ఉద్యోగమిస్తాం...

శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చేసిన అభ్యంతరపూర్వక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క హిందూ మహిళ ప్రాణానికి పది మంది ఇస్లామ్ మహిళలను బలితీసుకోవాలంటూ ప్రమోద్ పిలుపునివ్వడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇస్లామ్ కు చెందిన మహిళలను ట్రాప్ చేసి, వారి జీవితాలను నాశనం చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారికి తగిన భధ్రత కల్పిస్తామని ప్రమోద్ మాలిక్ ప్రకటించారు. కర్ణాటకలోని భగల్ కోట్ లో ఈ ప్రసంగం చేసిన ప్రమోద్ హిందూ మహిళల జీవితాలు లవ్ జీహాద్ వల్ల నాశనం అవుతున్నాయని అన్నారు. ఇటీవలే కర్ణాటకలోని ఉడిపి నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రమోద్ తనకు రాజకీయాలు రావంటూనే; అధికారంలో ఉన్న భాజాపా ఫేక్ హిందుత్వను ప్రదర్శిస్తోందని అన్నారు. తాను కూడా వారిలాగే ఫేక్ హిందుత్వ బాట పడితే ఈపాటికి ఎన్నో సాధించి ఉండేవాడినని తెలిపారు. మరోవైపు ప్రమోద్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాజకీయంగా కీలకంగా ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మత ఘర్షణలు చోటుచేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. మతం ముసుగులో మహిళల పట్ల అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com