శ్రీదేవి కూతురు.. శ్రీకాంత్ కొడుకు.. పెళ్లి సందడి షురూ..

శ్రీదేవి కూతురు.. శ్రీకాంత్ కొడుకు.. పెళ్లి సందడి షురూ..
పెళ్లి సందడితో శ్రీకాంత్ కెరీర్‌ని మలుపు తిప్పిన రాఘవేంద్రరావు.. తాజాగా ఆయన కొడుకు..

పాతికేళ్ల కిత్రం దర్శకుడు రాఘవేంద్ర రావు డైరక్షన్‌లో వచ్చిన పెళ్లి సందడి ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. ఆ చిత్రంలోని పాటలు, ఆద్యంతం నవ్వించే కామెడీ, శ్రీకాంత్, రవళి, సాక్షీశివానంద్ నటన అన్నీ కలసిసొచ్చే అంశాలే. అపురూప దృశ్యకావ్యంగా మలచిన రాఘవేంద్ర రావు మరోసారి మళ్లీ సందడి చేయాలనుకుంటున్నారు. మెగా ఫోన్ చేతబట్టి స్టార్ట్ కెమెరా అంటూ శ్రీకాంత్ కొడుకు రోషన్‌ని, శ్రీదేవి కూతురు ఖుషీని సందడి చేయడానికి సిద్ధం చేస్తున్నారని సమాచారం.

పెళ్లి సందడితో శ్రీకాంత్ కెరీర్‌ని మలుపు తిప్పిన రాఘవేంద్రరావు.. తాజాగా ఆయన కొడుకు కెరీర్ నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇక హీరోయిన్ విషయంలోనూ రాఘవేంద్రరావు తన సినిమాతోనే శ్రీదేవి రెండో కూతురు ఖుషీని వెండితెరకు పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్. మరోవైపు ఖుషీ కపూర్ తండ్రి బోనీ కపూర్ తమ సొంత ప్రొడక్షన్ కంపెనీతోనే ఖుషీని పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రాఘవేంద్ర రావు డైరక్షన్‌లో సినిమా వస్తుందంటే అభిమానుల సందడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.

Tags

Next Story