Kolkata: యూనివర్శిటీ ప్రొఫెసర్ బికినీ పోస్టులు.. ఉద్యోగం ఊస్టింగ్, రూ.99 కోట్లు ఫైన్

Kolkata: యూనివర్శిటీ ప్రొఫెసర్ బికినీ పోస్టులు.. ఉద్యోగం ఊస్టింగ్, రూ.99 కోట్లు ఫైన్
Kolkata: చేసేది ప్రొఫెసర్ ఉద్యోగం.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది.. విద్యార్థులకు ఏం నేర్పాలనుకుంటుంది.. అసలే యువత పక్కదారి పడుతోంది..

Kolkata: చేసేది ప్రొఫెసర్ ఉద్యోగం.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది.. విద్యార్థులకు ఏం నేర్పాలనుకుంటుంది.. అసలే యువత పక్కదారి పడుతోంది.. వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి పన్లు చేస్తే ఇంకేం బాగుపడతారు పిల్లలు.. ఆ తండ్రి ప్రొఫెసర్ బికినీ ధరించిన ఫోటోలు చూసి కోపంతో ఊగిపోయాడు.. యూనివర్శిటీకి వెళ్లి ఆమెపై కంప్లైంట్ ఇచ్చాడు.

కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తమ సంస్థకు అపారమైన, కోలుకోలేని నష్టాన్ని కలిగించారని" ప్రతిష్టాత్మక వర్సిటీకి రూ.99 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంటే ఆమెను విధుల నుంచి తొలగించారు.

యూనివర్శిటీలో చదువుతున్న తన కొడుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫెసర్ బికినీ ఫోటోలు చూడటం గమనించారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ సంఘటన అక్టోబర్ 2021 చివరి వారంలో జరిగింది. ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

'విద్యార్థి తండ్రి నుంచి ఫిర్యాదు'

మొదటి సంవత్సరం చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తండ్రి BK ముఖర్జీ వర్సిటీకి లేఖ రాశారు. యూనివర్శిటీ ప్రొఫెసర్ ఫోటోలు "అభ్యంతరకరమైనవి", "అసభ్యకరమైనవి" అని లేఖలో ఆరోపించారు.

" నా కొడుకు ప్రొఫెసర్ బికినీ ధరించి ఉన్న చిత్రాలను చూస్తున్నందుకు నేను ఆశ్చర్యపోయాను. అసభ్యకరమైన రీతిలో ఆమె ఇచ్చిన పోజులు జుగుప్స కలిగించేవిగా ఉన్నాయి. ఒక ఉపాధ్యాయురాలు లోదుస్తులు ధరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం తల్లితండ్రులుగా మాకు చాలా అవమానకరం అనిపించింది. ఎందుకంటే నేను నా కొడుకును ఇలాంటి వాటన్నింటికి దూరంగా ఉంచాలనుకున్నాను.

తనపై వచ్చిన అభియోగానికి వివరణ ఇచ్చుకున్న ప్రొఫెసర్ మీడియాతో మాట్లాడుతూ.. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు విశ్వవిద్యాలయ తనను రాజీనామా చేయమని కోరిందని పేర్కొన్నారు. "నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అభ్యంతరకరంగా ఉందని వారు పేర్కొన్నారు".

"యూనివర్శిటీలో జాయిన్ అవడానికి దాదాపు రెండు నెలల ముందు జూన్ 2021లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన చిత్రాలు అవి. నీలిరంగు స్విమ్‌సూట్‌లో నా రెండు చిత్రాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ డిఫాల్ట్‌గా 24 గంటలు మాత్రమే లైవ్‌లో ఉన్నందున ఆ ఫోటోలు ఇప్పటికీ యాక్సెస్ చేయబడే అవకాశం లేదు అని ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా, నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ 'ప్రైవేట్'. అది 'పబ్లిక్' ప్రొఫైల్ కాదు, కాబట్టి నా ఫోలోవర్స్ మాత్రమే నా పోస్ట్‌లు, నా ఫోటోలు చూడగలరు. కాబట్టి ఆ రెండు చిత్రాలను ఆ విద్యార్థి చూశాడంటే ఎలా నమ్మాలి అని ప్రొఫెసర్ వాపోతున్నారు. తర్వాత ప్రొఫెసర్ తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story