Tamil Nadu : అనాథలైన చిన్నారులకు రూ. 5లక్షలు..!

Tamil Nadu : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాంటి పిల్లలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ డబ్బును చిన్నారుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రకటించారు.
ఇక తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకి చిన్నారులకు రూ.3లక్షల సాయం అందజేస్తామని సీఎం తెలిపారు. అంతేకాకుండా అనాధలైన చిన్నారుల చదువులను కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని స్టాలిన్ ప్రకటించారు. వారి సంరక్షణ కొరకు ప్రభుత్వ వసతి గృహాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే వసతి గృహాలు కాకుండా చిన్నారులు తమ బంధువుల ఇళ్లల్లో ఉండాలనుకుంటే వారికి 18ఏళ్లు వచ్చేవరకు నెలకి మూడు వేల రూపాయలను అందజేస్తామని వెల్లడించారు. వారి సంరక్షణ కొరకు ఓ ప్రత్యేకమైన కమిటిని ఏర్పాటు చేస్తామని అన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com