బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం స్టాలిన్ ఫిదా!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు.. ఆక్సిజన్ అందక వందలమంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో సినీ ప్రముఖులు, మల్టీనేషనల్ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు.
అందులో భాగంగానే తమిళనాడుకు చెందిన హరిశ్వర్మాన్ అనే బాలుడు తన సైకిల్ కోసం దాచుకున్న డబ్బును కోవిడ్ రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చాడు.. బాలుడి దయగుణానికి ఫిదా అయిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ బాలుడికి బహుమతిగా కొత్త సైకిల్ ని ప్రదానం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ బాలుడి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10న లాక్ డౌన్ విధించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com