గత ముఖ్యమంత్రులకు విభిన్నంగా స్టాలిన్‌ తీరు..!

గత ముఖ్యమంత్రులకు విభిన్నంగా స్టాలిన్‌ తీరు..!
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌... భద్రతా వలయం దాటి సామాన్యులతో మమేకమవుతున్న తీరు ప్రశంసలందుకుంటోంది.

రాజు వెడలె రవితేజములడరగ అన్నట్లుగా.... ఆధునిక ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రుల ఆర్భాటం అంతాఇంతా కాదు. రాజప్రసాదాల్లా నివాసాలు... చుట్టూ భద్రతా వలయాలు... సీఎం బయట కాలుపెడితే 50కు పైగా లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్‌.. మంది మార్భలంతో హంగామా... ఇది తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల దర్పం. భద్రతా వలయాన్ని దాటుకుని సామాన్యుడు సీఎంను కలవడం ఇక కలే. దీనికి భిన్నం మన పొరుగునే ఉన్న రాష్ట్ర ముఖ్యమంతి.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌... భద్రతా వలయం దాటి సామాన్యులతో మమేకమవుతున్న తీరు ప్రశంసలందుకుంటోంది. తాజాగా స్టాలిన్‌ పార్కింగ్‌ చేస్తూ అక్కడి వాకర్లను పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడుతూ వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. అప్యాయంగా పలకరిస్తున్న స్టాలిన్‌ ను చూసి వాకింగ్‌ కు వచ్చినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. స్టాలిన్‌ తో మమేకమై మాట్లాడారు. అక్కడే వాకింగ్‌ కు వచ్చిన విద్యాశాఖ ఉద్యోగితో స్టాలిన్‌ మాట్లాడడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. సామన్య ప్రజల పట్ల ముఖ్యమంత్రి చూపుతున్న ఆదరణకు ఫిదా అయినట్లు వాకర్లు తెలిపారు.

ఆర్భాటానికి పోకుండా భిన్నంగా పరిపాలన అందిస్తున్న స్టాలిన్‌... గత ప్రభుత్వం పెట్టిన జయలలిత క్యాంటీన్లు కొనసాగించడం, గత ముఖ్యమంత్రి బొమ్మలున్న స్కూల్‌ బ్యాగులను పంచడం ఆయన తీరుకు మచ్చుతునక. ప్రజా ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ వ్యవహరిస్తున్న తీరును చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story