Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Bay of Bengal: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది జాఫ్నాకి తూర్పు ఈశాన్యంగా 520కిలో మీటర్ల దూరంలో, కారైకాల్‌కు 490 కిమీటర్ల దూరంలో కేంద్రీకృతమైయింది. ఇక చెన్నైకి 450 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే, చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాల్లో ఆకాశం దట్టమైన మేఘాలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి, శ్రీలంక సముద్ర తీరాల్లో వేటను నిషేదించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com