Nirai Mata: ఏడాదిలో 5 గంటలు మాత్రమే తెరుచుకునే ఆలయం.. నీరయ్ మాతా ఆలయంలో అన్నీ అద్భుతాలే..

Nirai Mata: భారతదేశంలో ఇలాంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రహస్యాలు దాగుంటాయి. ఈ రహస్యాలు కారణంగా, ఈ దేవాలయాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కొన్ని దేవాలయాలు ప్రత్యేకమైన నిర్మాణంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొన్ని దేవాలయాల్లో జరుగుతున్న వింత సంఘటనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందుతాయి. ఈ రోజు మనం చదవబోయే ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరానికి ఐదు గంటలు మాత్రమే తెరుచుకుంటుంది.
నీరయ్ మాతా ఆలయం.. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని గారియాబంద్ జిల్లా ప్రధాన కార్యాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై ఉంది. నిరయ్ మాతను పసుపు, కుంకుమలతో అలంకరించరు. కాని తల్లికి కొబ్బరికాయలు, ధూపం కర్రలతో మాతను అర్చిస్తారు.
నీరయ్ మాతా ఆలయంలో, చైత్ర నవరాత్రి ప్రత్యేక రోజు మాత్రమే అంటే ఉదయం 4 నుండి 9 వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. మిగిలిన రోజుల్లో ఇక్కడికి రావడం నిషేధించబడింది. ఈ ఆలయం తెరిచినప్పుడల్లా, తల్లి దర్శనం కోసం వేలాది మంది ఇక్కడికి చేరుకుంటారు.
ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి సందర్భంగా నీరయ్ మాతా ఆలయంలో దీపాలు నూనె లేకుండానే వెలుగుతుంటాయి. ఈ అద్భుతం ఎలా జరుగుతుంది, ఇప్పటి వరకు ఒక పజిల్‌గా మిగిలిపోయింది.
తొమ్మిది రోజులు చమురు లేకుండా దీపాలు వెలుగుతూ ఉండటం నిరయ్ దేవి చేసిన అద్భుతం అని గ్రామస్తులు అంటున్నారు. నీరయ్ మాతా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి మహిళలకు అనుమతి లేదు. ఇక్కడ పురుషులు మాత్రమే ఆరాధన చేస్తారు.
ఈ ఆలయ ప్రసాదాన్ని మహిళలు తినడం నిషేధం. స్త్రీలు ఆలయ నైవేద్యాలను తింటే వారికి అవాంఛనీయమైన ఏదో జరుగుతుందని అంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com